Mon Dec 23 2024 06:04:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి మల్లారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్.సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు
మాజీ మంత్రి మల్లారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్.సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. గిరిజనుల భూములను మల్లారెడ్డి కబ్జాచేశారని ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదయింది. మొత్తం 47 ఎకరాలను కబ్జా చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
గిరిజనుల భూములను...
ఎన్నికల సమయంలో రాత్రిక రాత్రే భూములను కబ్జా చేశారని, అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక ఎమ్మార్వోపైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు.
Next Story