Mon Dec 23 2024 00:44:37 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ పై కేసు నమోదు... రాజాసింగ్ అరెస్ట్
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చెంగిచర్లలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదయింది. నాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు.
రాజాసింగ్ ను...
అయితే ఈ సందర్భంగా చెంగిచెర్లకు వెళతానని ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదని రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ హాయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
Next Story