Thu Dec 19 2024 06:02:22 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్‌పై కుట్ర కేసు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఆయన కుట్ర పన్నినట్లు అభియోగం మోపారు. నిన్న అర్థరాత్రి కరీంనగర్లో అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ను తొలుత బొమ్మల రామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య పోలీసులు బండి సంజయ్‌ను తీసుకెళ్లారు. బండిని ఎక్కడకు తీసుకెళుతున్నారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
డీజీపీకి కేంద్రమంత్రి ఫోన్...
అయితే యాదాద్రిలోని మెజిస్ట్రేట్ నివాసం వద్దకు బండి సంజయ్‌ను తీసుకెళ్లారని చెబుతున్నారు. నిన్న వరంగల్‌లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకయిన సంఘటనలో బండి సంజయ్ ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పేపర్ లీకేజీ అంశాన్ని బండి సంజయ్ పై రుద్దు తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. డీజీపీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి సంజయ్ అరెస్ట్‌కు గల కారణాలేంటని ప్రశ్నించారు.
Next Story