Mon Dec 23 2024 16:13:56 GMT+0000 (Coordinated Universal Time)
కలెక్టర్ వాహనానికి భారీ జరిమానా
కామారెడ్డి కలెక్టర్ వాహనానికి పోలీసులు భారీ జరిమానాను విధించారు
కామారెడ్డి కలెక్టర్ వాహనానికి పోలీసులు భారీ జరిమానాను విధించారు. కలెక్టర్ వాహనానికి 27,580 లు జరిమానా విధిస్తూ పోలీసులు చలాన్లు పంపారు. అయితే ఎన్నిసార్లు చలానాలు పంపినా కలెక్టర్ కార్యాలయం చెల్లించలేదు. దాదాపు 28 పెండింగ్ చలానాలు కలెక్టర్ వాహనంపై ఉంది.
పెండింగ్ చలానాలు....
ప్రభుత్వ వాహనానికి ఇంత పెద్దమొత్తంలో పెండింగ్ చలానాలు ఉండటం చర్చనీయాంశమైంది. కామారెడ్డి కలెక్టర్ వాహనానికి ఎక్కువగా హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ చలానాలు పడినట్లు తెలిసింది. 27 సార్లు ఓవర్ స్పీడ్ తో కలెక్టర్ వాహనం వెళ్లినట్లు ఈ చలానాలను బట్టి తెలుస్తోంది. కలెక్టర్ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు మాత్రం చలానాలు భారీగానే విధించారు.
Next Story