Wed Dec 25 2024 13:03:14 GMT+0000 (Coordinated Universal Time)
పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళిత బంధు రెండవ విడత డబ్బులు విడుదల చేయాలంటూ ఈ నెల 9వ తేదీన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అయితే ధర్నా, రాస్తారోకోకు ఎలాంటి అనుమతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీసుకోకపోవడంతో నోటీసులు జారీ చేశారు.
అనుమతి తీసుకోకపోవడంతో...
సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కౌశిక్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి పోలీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు కావడంతో పాటు నోటీసులు కూడా జారీ చేయడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే ఇది రాజకీయ కక్ష వేధింపుల కేసులేనంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
Next Story