Fri Apr 11 2025 12:07:07 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు ఇచ్చారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్యాంప్ ఆఫీసులో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి లేకపోవడంతో పోలీసులు నోటీసులు ఆయన సిబ్బందికి అందచేశారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించినఫామ్ హౌస్ లో కోడి పందేలు, క్యాసినో జరిగిందన్న కేసు నమోదయింది.
ఫామ్ హౌస్ లో...
ఈ నేపథ్యంలోనే ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో నోటీసులు జారీ చేశారు. రేపు మొయినాబాద్ పీఎస్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రేపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది
Next Story