Thu Apr 10 2025 06:47:24 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో కోళ్ల పందేలు, క్యాసినో వంటివి జరుగుతుండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లీజుకిచ్చిన ఫామ్ హౌస్ లో...
పదకొండు ఎకరాలున్న ఫామ్ హౌస్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ లీజుకు ఇచ్చారని తెలిసింది. అయితే లీజుకు ఎవరికి ఇచ్చారు? ఎన్ని రోజుల అగ్రిమెంట్? ఎంతకాలంగా ఈ లీజు కొనసాగుతుందన్న దానిపై పోలీసులు విచారణ చేయడానికి ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ఫామ్ హౌస్ లో భారీగా నగదుతో పాటు పందెంకోళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story