Mon Dec 15 2025 08:29:41 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరణ
మహబూబాబాద్ లో కేటీఆర్ ధర్నాకు అనుమతిని పోలీసులు నిరారకరించారు

మహబూబాబాద్ లో కేటీఆర్ ధర్నాకు అనుమతిని పోలీసులు నిరారకరించారు. లగచర్ల ఘటనకు నిరసనగా నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా చేయాలని నిర్ణయించింది. అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు, సీపీఐ నాయకులు, పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ తెలిపారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించి...
అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంపై సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తాము హైకోర్టును ఆశ్రయించి మహా ధర్నా చేపడతామని ఆమె తెలిపారు. త్వరలోనే యాభై వేల మందితో మహబూబాబాద్ లో మహా ధర్నా చేపడతామని, పోలీసులు అనుమతి ఇవ్వకపోతే న్యాయపరంగా పోరాడా సాధించుకుంటామని ఆమె తెలిపారు.
Next Story

