Mon Dec 15 2025 08:10:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన సెలబ్రిటీలు
తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమయింది.

తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. హైదరాబాద్ నగరంలో సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు.
క్యూ లో నిల్చుని...
మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్లంతా తమ కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూలులో కుటుంబ సభ్యులతో కలసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన సతీమణి ప్రణతితో పాటు తల్లి షాలిని కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అల్లు అర్జున్ కూడా తన సతీమణి స్నేహారెడ్డితో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story

