Thu Dec 19 2024 09:37:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Polling : మీ ఓటు ఎక్కడుంది? హైరానా అక్కర్లేదు.. సులువుగా తెలుసుకోండి ఇలా
తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. రేపు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే రోజు
తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. రేపు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే రోజు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. అందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రచారం నిర్వహించి ఓటర్లను చైతన్యవంతుల్ని చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పెద్ద యెత్తున ప్రకటనలు కూడా జారీ చేసింది. అయితే చాలా మంది తమకు ఓటు ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు కలిగిన వారికి ఇది మరింత అనుమానం రేకెత్తిస్తుంది.
కొత్త ఓటర్లకు...
ఏ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి? ఎక్కడకు వెళ్లాలి? అన్న అనుమానాలు సహజంగా తలెత్తుతాయి. ఓటర్ల స్పిప్పులు అందరికీ అందకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పాలి. రేపే పోలింగ్ కాబట్టి ఇక ఓటర్ల స్పిప్ లు కూడా చేరే అవకాశం లేదు. దీంతో తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలో తెలుసుకోవాలంటే చాలా సులువైన పని. మీ చేతిలో పని. క్షణాల్లో మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. హైరానాపడొద్దు. ఓటు వేసేందుకు ముందుకు రావాలని ఎన్నికల సంఘం కోరుతుంది.
మొబైల్ ద్వారానే...
కేవలం మొబైల్ ద్వారానే ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవచ్చో తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం అడ్రస్ ఇట్టే తెలిసిపోతుంది. మీ దగ్గర ఉన్న ఓటరు గుర్తింపు కార్డు మీద ఉన్న నెంబరును 1950, 92117, 28082 లకు ఎస్ఎంఎస్ పంపితే చాలు వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. మీ పోలింగ్ కేంద్ర అడ్రస్ అందులో ప్రత్యక్షమవుతుంది. 1950 టోల్ ఫ్రీ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఎన్నికల కమిషన్ కు చెందిన ఓటరు హెల్ప్ లైన్ యాప్ డౌన్ లౌడ్ చేసుకుని కూడా సమాచారం పొందే వీలుంది. www.ceotelangana.nic.in కానీ electoralsearch.eci.gov.in ద్వారా కూడా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు.
Next Story