Mon Dec 23 2024 05:16:09 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడుపై భారీ బెట్టింగ్ లు
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 6వ తేదీన కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 6వ తేదీన కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. అయితే గెలుపోటములపై భారీ ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారంటూ అధిక మొత్తంలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయంపైన కూడా భారీ స్థాయిలోనే బెట్టింగ్ లు చోటు చేసుకుంటున్నాయి.
ఈ రెండు పార్టీలపైనే...
ఎక్కువగా టీఆర్ఎస్, బీజేపీల మీదనే బెట్టింగ్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వెయ్యికి రెండు వేలు ఇస్తామని లక్షల్లో బెట్టింగ్ లు జరిగినట్లు తెలిసింది. అదే సమయంలో టీఆర్ఎస్ విజయం ఖరారయిందని పదివేలకు పైగా మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని భారీగా బెట్టింగ్ లు జరిగినట్లు తెలిసింది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ ఈ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నట్ల తెలిసింది.
Next Story