Mon Dec 23 2024 12:45:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో అత్యధికంగా పోలింగ్ ఎక్కడ జరిగిందంటే?
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధకారి వికాస్ రాజ్ వెల్లడించారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధకారి వికాస్ రాజ్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 65.67 శాతం మేరకు పోలింగ్ జరిగినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా భువనగిరి జిల్లాలో 76.78 శాతం పోలింగ్ నమోదయిందని తెలిపారు.
అతి తక్కువగా...
అతి తక్కువగా హైదరాబాద్ లో 48.48 శాతం పోలింగ్ నమోదయినట్లు వికాస్ రాజ్ తెలిపారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా84.25 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మలక్పేట్ లో అతి తక్కువగా 42.76 శాతం నమోదయిందని వికాస్ రాజ్ తెలిపారు.
Next Story