Fri Nov 22 2024 20:39:50 GMT+0000 (Coordinated Universal Time)
24 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గుడ్ న్యూస్
పేదలకు 24 లక్షల ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే ఇవ్వనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వబోతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతీ పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామని, 24 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చామని మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని, గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఇక ప్రజల నుంచి వినతిపత్రాలు కూడా మంత్రి పొంగులేటి స్వీకరించారు. ధరణిని అడ్డం పెట్టుకుని గత పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనేక ప్రభుత్వ స్థలాలను గత పాలకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వాటన్నింటిని తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తామన్నారు.
Next Story