Mon Mar 31 2025 02:43:29 GMT+0000 (Coordinated Universal Time)
Ration Cards : ఉగాది పండగకు పేదలకు నిరాశేనా? రేషన్ కార్డులు అందేదెప్పుడు?
తెలంగాణలో రేషన్ కార్డులు ఉగాదికి ఇస్తే బాగుంటుందని పేదలు ఆకాంక్షిస్తున్నారు.

తెలంగాణలో రేషన్ కార్డులు ఉగాదికి ఇస్తే బాగుంటుందని పేదలు ఆకాంక్షిస్తున్నారు. రేషన్ కార్టుల జారీ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉగాది రోజు నుంచి సన్న బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధమవుతుండటంతో తమకు రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే గ్రామ సభలద్వారా, మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. లక్షలాది మంది తెలుపు రంగు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ దఫా రేషన్ కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నా ఎంత మందికి ఇస్తారన్నది మాత్రం ఇంకా తేలకపోవడంతో కొంత ఆందోళన నెలకొంది.
ఆరు గ్యారంటీలు...
తెలంగాణలోని ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీకు తెలుపు రంగు రేషన్ కార్డు కావాల్సి ఉండటంతో పాటు సన్న బియ్యం తమకు అందుతుందని, తమకు కూడా పండగ జరుపుకోవాలని ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం అని భావించి ప్రజలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తుల వడపోత ప్రారంభించిన అధికారులు త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకూ చేతికి అందకపోవడంతో అనేక మంది నిరాశకు లోనవుతున్నారు. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఈ కార్డుతోనే లభించనున్నా
కొత్త రేషన్ కార్డులను...
కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26వ తేదీ నుంచి జారీ చేయడం ప్రారంభిస్తామని చెప్పినా అనేక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. నేటి వరకూ తెలంగాణలో దాదాపు పది లక్షల కు పైగానే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రాధమికంగా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. తెలుపు రంగు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక జారీ చేయడలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఉగాది పండగ నాటికైనా రేషన్ కార్డు ఇచ్చి తమకు తీపి కబురు అందించాలని పేద ప్రజలు కోరుతున్నారు.
Next Story