Thu Dec 19 2024 14:57:03 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో కోమటిరెడ్డిపై పోస్టర్ల కలకలం
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ద్రోహివి అంటూ పోస్టర్లు వెలిశాయి. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. 22 వేల కోట్ల కోట్ల కాంట్రాక్టు కోసం పార్టీని వదిలిపెట్టావంటూ ఆయనపై పోస్టర్లు వెలిశాయి.
నీచుడివి అంటూ...
సోనియా గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరాలాడుకున్న నీచుడివి అంటూ పోస్టర్లలో ముద్రించారు. మునుగోడు నిన్ను క్షమించదు అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ యే ఈ పోస్టర్లను విడుదల చేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఈ పోస్టర్లు కన్పించడం కొంత గందరగోళానికి దారితీసింది. పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story