Sat Dec 21 2024 17:48:55 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కేటీఆర్ కు థ్యాంక్స్ చెబుతూ ప్రభాస్ స్పెషల్ వీడియో
ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరుగుతుండడం చాలా గర్వంగా ఉంది. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం..
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల షూటింగ్ లతో.. రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆహా లో ప్రసారమైన అన్ స్టాపబుల్ 2 షో లో ప్రభాస్ కనిపించడంతో అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. సోషల్ మీడియాలో మిలియన్లకొద్దీ ఫాలోవర్స్ ఉన్నా.. పెద్దగా కనిపించని ప్రభాస్.. తాజాగా ఓ థ్యాంక్యూ వీడియోతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్కు థాంక్స్ చెబుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకంటే.. ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ‘ఫార్ములా ఈ రేస్’ జరగబోతోంది. ఈ గ్లోబల్ ఈవెంట్ ని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నందుకు ప్రభాస్.. కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
"ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరుగుతుండడం చాలా గర్వంగా ఉంది. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీ సిఈవో అనిల్ చలం శెట్టికి ప్రభాస్ థాంక్యూ. ఈ ఈవెంట్ ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలి." అంటూ ప్రభాస్ ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఫిబ్రవరి 11న జరిగే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను బుక్ మై షో యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధరలు.. రూ.1000, రూ.3500, రూ.6000, రూ.10000 గా ఉన్నాయి. కాగా..ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాయి.
Next Story