Mon Dec 23 2024 12:43:07 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి ప్రజావాణి ప్రారంభం.. కోడ్ ముగియడంతో
నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రజాభవన్ లో వినతులను స్వీకరించనున్నారు
నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో గత మూడు నెలల నుంచి ప్రజావాణి కార్యక్రమం జరగడం లేదు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ కార్యక్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రజల నుంచి వినతులను...
ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అధికారులు వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం పంపనున్నారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని ప్రభుత్వం భావించి తిరిగి నేడు శుక్రవారం కావడంతో నేటి నుంచి ప్రారంభిస్తుంది.
Next Story