Sat Nov 23 2024 01:51:10 GMT+0000 (Coordinated Universal Time)
రామగుడం విద్యుత్తు ప్రాజెక్టు నేడు జాతికి అంకితం
రామగుండంలోని సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు
రామగుండంలోని సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వంద మెగావాట్లతో జలాశయం తేలయాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ఎన్టీపీసీ నిర్మించింది. ఇటువంటి ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్దదని చెబుతున్నారు. మొత్తం 423 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టను పూర్తి చేసింది. రెండేళ్ల పాటు వీట నిర్మాణ పనులు కొనసాగాయని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు.
ఐదు వందల ఎకరాల్లో....
ఐదు వందల ఎకరాల జలాశయం పై ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందులో నలభై బ్లాక్ లు ఉంటాయి. ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉండేలా దీనిని డిజైన్ చేశారు. దీనిని ఇప్పటికే వినియోగంలోకి తెచ్చారు. జులై 1వ తేదీ నుంచి వంద మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టును కేవలం వాణిజ్యరంగానికే వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
Next Story