Sat Dec 28 2024 05:35:00 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. మెదక్ జిల్లాలోని దుర్గం ఐబీ స్క్వేర్ లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో మెదక్, బీజేపీ పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానని నిర్వహించనున్నారు.
మెదక్ జిల్లాలో...
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోదీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని కోరారు. ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణలో అత్యధిక స్థానాలను లోక్సభ స్థానాల్లో విజయం సాధించే దిశగా ఆ పార్టీ ప్రయాత్నాలు ప్రారంభించింది.
Next Story