Mon Dec 15 2025 00:15:01 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక
నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగనుంది

నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగనుంది. ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. పూర్తిగా ఉత్తర భారతంపైనే ప్రియాంక ఫోకస్ పెట్టడంతో ఇక్కడకు రావడం కష్టమయిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రెండు నియోజకవర్గాల్లో...
అయితే తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న చివరి రోజున ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి లలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

