Mon Dec 23 2024 09:21:05 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పదేళ్ల తర్వాత వారికి గుడ్ న్యూస్.. రెడీ అవుతున్న సర్కార్
తెలంగాణలో రైతు భరోసాను అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు.
తెలంగాణలో రైతు భరోసాను అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. దీనిపై విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. అయితే రైతుభరోసా ఎన్ని ఎకరాలున్న వారికి ఇవ్వాలి? ఇన్నాళ్లూ గత ప్రభుత్వం అందించిన వారికి కాకుండా విధివిధానాల్లో మార్పులు తేవాలని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఐదు ఎకరాలున్న వారికి మాత్రమే ఇవ్వాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.
ఎన్నికల ప్రచారంలో...
అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పడంతో వారికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కౌలు రైతుల విషయంలోనూ కేబినెట్ సబ్ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనుంది. ఎందుకంటే ఎక్కువ ఎకరాలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులకు కాకుండా కొద్ది ఎకరాలను మాత్రమే తమ జీవనోపాధి కోసం కౌలుకు తీసుకున్న రైతులకు ఇచ్చేలా విధానాలను రూపొందించే అవకాశం ఉందంటున్నారు.
Next Story