Mon Dec 23 2024 09:17:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆగిపోయిన గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ.. అయోమయంలో అభ్యర్థులు
ఈ నెల 23 శుక్రవారం నుండి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అధికారిక వెబ్ సైట్ లో మాత్రం..
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-4 ఉద్యోగ నియామకాలకై దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. కానీ సాంకేతిక కారణాలతో ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది. డిసెంబర్ 1న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23 శుక్రవారం నుండి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అధికారిక వెబ్ సైట్ లో మాత్రం.. ఈ నెల 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సూచిస్తోంది. డిసెంబర్ 30 నుంచి వచ్చే జనవరి 19, సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెబ్సైట్లో దర్శనమిస్తోంది. కానీ దీనిపై స్పష్టమైన అధికారిక ప్రకటన లేకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నాయి.
టీఎస్పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లో అనేక లోపాలున్నాయి. అందులో ఉద్యోగాలెన్ని ఉన్నాయి? జిల్లాల వారీగా, జోనల్ వారీగా, మల్టీ జోనల్ వారీగా.. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులున్నాయి? వంటి వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా.. ఆ వివరాలేమీ లేకుండానే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ జారీ చేస్తున్న ప్రకటనల్లో స్పష్టమైన సమాచారం లేకపోవడంతో.. అభ్యర్థులు సరైన సమాచారం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి.
Next Story