Mon Dec 23 2024 09:06:59 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచే టీచర్ల బదిలీలు, పదోన్నతులు
నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసింది. 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎప్పటి నుంచో ఎందరో ఎదురు చూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం...
మరోవైపు ఆందోళన కూడా పెరిగింది. తాము అనుకున్న చోట పోస్టింగ్ వస్తుందా? రాదా? అన్న దానిపైన కూడా ఉపాధ్యాయులు కలవర పడుతున్నారు. అయితే ఇప్పుడు బదిలీ అయిన, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరం చివరి రోజునే ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ కానున్నారు.2023 ఫిబ్రవరి 1 వ తేదీ కటాఫ్ తేదీగా బదిలీలకు నిర్ణయించారు. ఒకే పాఠశాలలో రెండు సంవత్సరాలు దాటిన వారు బదిలీలకు దరఖాస్తు చేసుకునే వీలుంది.
Next Story