Tue Dec 17 2024 11:42:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో ప్రజావాణికి బ్రేక్
తెలంగాణలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమానికి బ్రేక్ పడింది.
తెలంగాణలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రజా భవన్ లో ప్రజల నుంచి వినతులను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ప్రజావాణిగా నామకరణం చేశారు.
ప్రజా సమస్యలను...
తెలంగాణలోని నలుమూలల నుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇక్కడకు చేరుకుని అధికారులు, మంత్రులకు వినతులు అందచేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు జరుుగుతున్న నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో ప్రజావాణిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి జూన్ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Next Story