Sun Mar 16 2025 12:33:18 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : మిగిలిన ఆరు మృతదేహాలు ఎక్కడ? సహాయక బృందాలు ఏం చేస్తున్నాయి?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి లభించింది. ఒక మృతదేహం లభ్యమయింది

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి లభించింది. ఒక మృతదేహం లభ్యమయింది. టీబీఎం మిషన్ వద్దనే మృతదేహం లభించడంతో దానిని బంధువులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దాదాపు ఎనిమిది అడుగుల లోతు తవ్విన తర్వాత మాత్రమే మృతదేహం లభ్యమయింది. గురుప్రీత్ సింగ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. అయితే మిగిలిన ఏడు మృతదేహాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. కేరళ నుంచి తెప్పించిన జాగిలాలతో వాటిని గుర్తించే పనిలో సహాయక బృందాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
పదిహేడో రోజుకు...
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేటికి పదిహేడో రోజుకు చేరుకుంది. మొత్తం ఎనిమిది మంది టన్నెల్ లో చిక్కుకుపోయారు. అందులో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. చేతికి కడియం ఉండటంతో ఆ డెడ్ బాడీని గురు ప్రీత్ సింగ్ దిగా గుర్తించారు. అయితే మిగిలిన మృతదేహలు ఎక్కడ ఉన్నాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీబీఎం మిషన్ వద్దనే ఉంటాయన్న అంచనా తో దానిని తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. అదే సమయంలో దాని కింద మృతదేహాలు మరిన్ని ఉండే అవకాశముందని కూడా సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. పై కప్పు కూలి పోవడంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీసు క్రమంలో టీబీఎం మిషన్ కింద పడి మరణించి ఉంటారని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
రేపు సీఎం సమీక్ష...
పదిహేడు రోజులు కావడంతో మిగిలిన ఏడుగురు కూడా బతికే అవకాశం లేదు. మొత్తం పదకొండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఇప్పటి వరకూ ఆచూకీ లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అక్కడే ఉండి సహాయక చర్యలను ప్రారంభిస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై సమీక్ష జరిపే అవకాశముంది. అలాగే టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించే అవకాశముందని కూడా చెబుతున్నారు. అదే సమయంలో సహాయక చర్యల్లో మరింత వేగం పెంచి వీలయినంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story