Fri Dec 20 2024 07:03:05 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి కరీంనగర్ లో కాంగ్రెస్ సభ
ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు
ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ముఖ్య అతిధిగా రానున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతుంది. ఎల్లుండి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు చేరుకుంటారు. ఆ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రైతులకు భరోసాగా...
ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఛత్తీస్ఘడ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడ అమలు చేస్తామన్న హామీలు ఇవ్వనున్నారు. ముందుగా రైతులకు భరోసా కల్పించేవిధంగా ప్రసంగాలు సాగనున్నాయి. వరంగల్ డిక్లరేషన్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మరోసారి ప్రజలకు ప్రామిస్ చేయనున్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్న హామీని ప్రజలకు ఇవ్వనున్నారు.
Next Story