Sun Nov 17 2024 01:46:29 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో వైద్య విద్యార్ధిని మృతి
ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్ధిని పూజితా రెడ్డి బీడీఎస్ చదివేందుకు కెనాడా వెళ్లి గుండెపోటుతో మరణించారు
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి ఓ వైద్య విద్యార్థిని గుండెపోటుతో మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూజితారెడ్డి ఇక్కడే ఒక ప్రయివేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం కెనాడా వెళ్లారు. అయితే కెనడాలో హాస్టల్ లో ఉంటూ గుండెపోటుకు గురై మరణించారు. దీంతో ఆమె స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉన్నత చదువులు చదివేందుకు...
ఖమ్మం జిల్లా మల్కాపూర్ కు చెందిన వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. కుమార్తె పూజితారెడ్డి ఖమ్మంలోనే ఒక ప్రయివేటు కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఏడాది జనవరి 26వ తేదీన కెనడా వెళ్లారు. ఆమె సోదరుడు అరుణ్ రెడ్డి కూడా కెనడాలోనే ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం హాస్టల్ లో చేరారు. హాస్టల్ లో గుండెపోటుతో మరణించారు. పూజితారెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.
Next Story