Sun Dec 22 2024 22:25:17 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టెన్త్ ప్రశ్నాపత్రం లీక్
పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది
పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.
తెలుగు ప్రశ్నాపత్రం...
అయితే వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం తమ జిల్లా పరిధిలో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని చెబుతున్నారు. తొలిరోజు తెలుగు పరీక్ష జరుగుతుంది. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం లీకేజీ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరులోని ఒక వాట్సప్ గ్రూపులో ఈ ప్రశ్నాపత్రం కనిపించింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది వెంటనే గ్రూప్‌లో పెట్టిన వ్యక్తి డిలీట్ చేసినా ప్రశ్నాపత్రం మాత్రం వైరల్ గా మారిపోయింది.
Next Story