Mon Dec 23 2024 18:25:03 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్... ప్రయివేటు కళాశాల నుంచే
తెలంగాణలో జరుగుతున్న పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి
తెలంగాణలో జరుగుతున్న పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ఈ మేరకు బోర్డు సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రశ్నా పత్రాలను లీకవుతుండటాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాట్సాప్ ద్వారా....
దీనిపై విచారించగా బాట సింగారం లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నాపత్రాలు లీకవుతున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు ఈ కళాశాల నుంచి వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపుతున్నట్లు విచారణ లో తేలింది. దీంతో పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story