Mon Dec 23 2024 03:39:34 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు మాజీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డిపైన కూడా కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్ పైన కూడా కేసు నమోదయింది.
ఛైర్పర్సన్ ఫిర్యాదు మేరకు...
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఛైర్మన్ పోస్టు కోసం మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన నుంచి 2.50 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ మున్సిపల్ ఛైర్పర్సన్ స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా తాను ఛైర్ పర్సన్ గా ఎన్నికయిన నాటి నుంచి కులం పేరుతో దూషిస్తున్నారని, అనేక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ సయితం తనను బెదిరించారని స్రవంతి ఫిర్యాదులో తెలిపారు. దీంతో వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదయింది.
Next Story