Mon Dec 23 2024 02:19:43 GMT+0000 (Coordinated Universal Time)
వర్సిటీలో ర్యాగింగ్.. ఏడుగురు ఏడాది సస్పెన్షన్
ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను పిలిచి సీనియర్లు ర్యాంగింగ్ చేశారు
ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను పిలిచి సీనియర్లు ర్యాంగింగ్ చేశారు. దీనిపై జూనియర్లు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. ర్యాగింగ్ పై యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ఛాన్సిలర్ సీరియస్ అయ్యారు. ర్యాంగింగ్ కు కారణమైన ఏడుగురు సీనియర్లను ఏడాదిపాటు హాస్టల్ నుంచి సస్పెండ చేశారు. ర్యాగింగ్ కు యూనివర్సిటీలో చోటు లేదని ఆయన తెలిపారు.
హాస్టల్ లోకి వస్తే....
జూనియర్స్ ఉంటున్న హాస్టల్ లోకి వచ్చి సీనియర్లు ర్యాంగింగ్ కు పాల్పడినట్లు తేలింది. ఇందులో 16 మంది సీనియర్లు పాల్గొన్నట్లు విచారణలో బయటపడింది. యాంటీ ర్యాగింగ్ టీంకు వార్నింగ్ ఇచ్చారు. ఇకపై జూనియర్ల హాస్టల్ లోకి సీనియర్లు వెళితే కేర్ టేకర్ లపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులు తమ భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని వీసీ కోరారు.
Next Story