Mon Dec 23 2024 17:17:44 GMT+0000 (Coordinated Universal Time)
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. హస్టల్ వన్ లో ఈ గొడవ జరిగిందని తెలిసింది. ర్యాగింగ్ విషయాన్ని ఒక విద్యార్థి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రెండు రోజుల క్రితం ర్యాగింగ్ జరిగినట్లు ఆ విద్యార్థి పేర్కొన్నారు.
తప్ప తాగి....
ఫ్రెషర్స్ డే వేడుకలకు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించారు. దాదాపు యాభై మంది పాల్గొన్న ఈ వేడుకల్లో విద్యర్థుల మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించి సీనియర్లు జూనియర్ల పట్ల అనుచితం వ్యవహరించారని ఆ విద్యార్థి ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై కళాశాల యాజమాన్యం విచారణ చేపట్టింది.
Next Story