Thu Nov 07 2024 10:36:29 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మళ్లీ మొదలైన రాహుల్ గాంధీ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మళ్లీ మొదలైంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద యాత్రను ప్రారంభించారు. ఉదయం నడకలో భాగంగా అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరిఆలయం, పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్‌రోడ్డు, కచ్వార్ గ్రామం మీదుగా 12 కిలోమీటర్లకు పైగా నడవనున్నారు. మధ్యాహ్నం జక్లైర్ లో బసచేసిన తర్వాత సాయంత్రం 4గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించి జక్లైర్ క్రాస్‌రోడ్డు, గుడిగండ్ల మీదుగా 14.5 కి.మీ. ప్రయాణించి యెలిగండ్ల గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం మళ్లీ అక్కడి నుంచే మూడో రోజు పాదయాత్రను కొనసాగిస్తారు. ఈ యాత్ర నవంబర్ 7 వరకు రాష్ట్రంలో జరగనుంది. ఉమ్మడి మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, హైద రాబాద్, మెదక్, నిజామాబాద్æ జిల్లాల్లో పాద యాత్ర సాగనుంది.
ఈనెల 23న కర్ణాటక నుంచి నారాయణ పేట జిల్లా కృష్ణా మండలం గూడేబల్లేరు గ్రామానికి రావడం ద్వారా తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ మొదటిరోజు యాత్ర తర్వాత దీపావళి విరామం తీసుకున్నారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలో ఉన్న ఆయన 27 నుంచి జరిగే యాత్రలో పాల్గొనేందుకు బుధవారం అర్ధరాత్రి దాటాక గూడేబల్లేరు సమీపంలోని టైరోడ్ జంక్షన్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో టైరోడ్ జంక్షన్‌కు వెళ్లారు. రాహుల్ భారత్ జోడో యాత్ర 16 రోజుల పాటు తెలంగాణలో సాగనుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారు. తెలంగాణలో పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుంది.
Next Story