Mon Dec 23 2024 03:05:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనకు అన్యాయం.. ఇక్కడేమో సోనియా గాంధీ దయ
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడుతున్న సమయంలో పలు పార్టీల అగ్రనేతలు
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడుతున్న సమయంలో పలు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి చేరుకున్నారు. ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దివంగత పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని ప్రియాంకగాంధీ చెప్పారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ... పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ప్రియాంక గాంధీకి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, అవమానించిందన్నారు. మనమంతా అభిమానించే వ్యక్తి పీవీ, తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందన్నారు. 1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి, కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందన్నారు.
శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని అన్నారు. ఈ రోజు అక్రమాలు చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల వద్ద కూడా ఈ అక్రమార్జన ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని, ఆ డబ్బంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికే చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా దోచుకున్నారని ఆరోపించారు.
Next Story