Sat Dec 21 2024 03:05:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణలోకి రాహుల్ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక నుంచి యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక నుంచి యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆయనకు స్వాగతం పలికారు. రాహుల్ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకూ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 13 కిలోమీటర్ల మేర ఆయన ఈరోజు యాత్ర చేసి విరామం ప్రకటించనున్నారు. తెలంగాణలో మాత్రం 3.9 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు.
ఢిల్లీకి....
అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. దీపావళి సెలవులు రావడంతో మూడు రోజుల పాటు రాహుల్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. మక్తల్ కు చేరుకునే రాహుల్ అక్కడ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళతారు. మక్తల్ లో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ నెల 27వ తేదీ తిరిగి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రను మక్తల్ నుంచి ప్రారంభిస్తారు. తెలంగాణలో దాదాపు పదిహేను రోజులకు పైగానే సాగనుంది.
Next Story