Sat Dec 21 2024 02:51:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు 25 కి.మీ రాహుల్ పాదయాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలో పదో రోజుకు చేరుకుంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలో పదో రోజుకు చేరుకుంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ నేడు ఉదయాన్నే బయలుదేరారు. చౌటూర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమయింది. ఈరోజు ఆంథోల్, జోగిపేట్, అన్నసాగర్ మీదుగా కొనసాగనుంది. ఈరోజు రాహుల్ పాదయాత్ర 25 కిలోమీటర్ల మేరకు సాగుతుందని నిర్వాహకులు చెప్పారు. రాహుల్ వెంట కాంగ్రెస్ శ్రేణులు అనుసరిస్తున్నాయి.
రాత్రి బస...
ఈరోజు రాత్రి అల్లా దర్గ్ వద్ద రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. తెలంగాణలోనూ విజయవంతంగా పూర్తి చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది రోజులు రాహుల్ యాత్ర తెలంగాణలోనే కొనసాగుతుంది. చలి తీవ్రత, ఉదయన్నే మంచుకురుస్తున్నా రాహుల్ మాత్రం యాత్రను తాను నిర్దేశించుకున్న సమయానికే ప్రారంభిస్తుండటం విశేషం.
Next Story