Wed Dec 25 2024 21:06:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు నేటితో ముగింపు
తెలంగాణలో రాహుల్ గాంధీ సభ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రికి పాదయాత్ర మహారాష్ట్రకు చేరుకోనుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ సభ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రికి పాదయాత్ర మహారాష్ట్రకు చేరుకోనుంది. తెలంగాణలో రాహుల్ యాత్రకు మంచి స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కామారెడ్డి జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్ లో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు లక్ష మంది జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
రేపటి నుంచి..
రాహుల్ పాదయాత్ర ముగింపు సభకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఈరోజు 20 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ముగించనున్నారు. కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్రను ఇప్పటి వరకూ రాహుల్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పూర్తి చేసుకున్నారు. రేపటి నుంచి మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. రేపు యాత్రకు బ్రేక్ ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ లో ఒకరోజు ప్రచారానికి రాహుల్ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story