మల్లారెడ్డి కాలేజీలో కోట్లలో నగదు పట్టివేత
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లెక్కల్లో చూపని రూ.1.4 కోట్ల నగ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లెక్కల్లో చూపని రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలపై బుధవారం దాడులు చేసిన ఈడీ అధికారులు విచారణలో వెళ్లడైన వివరాల ఆధారంగా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మల్లారెడ్డి వైద్య కళాశాల నుంచి కోటి నలభై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలో ఉన్న మరో రెండు కోట్ల ఎనభై లక్షలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 12 మెడికల్ కాలేజీలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటి మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని MNR మెడికల్ కాలేజీ, బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, ప్రతిమ మెడికల్ కాలేజీ, డెక్కన్, SVS కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 16 చోట్ల తనిఖీలు జరిగాయి. పీజీ, మెడికల్ సీట్లను బ్లాక్ చేసినందుకు ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్‌తో పాటు పలుచోట్ల తనిఖీలు చేశామన్నారు. కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వెళ్లడైన ఆధారాల నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులు పెట్టినట్టు తెలిపారు.