Sat Nov 23 2024 02:20:36 GMT+0000 (Coordinated Universal Time)
చలో సంక్రాంతి.. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు
సంక్రాంతి పండగ కోసం ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి పండగ కోసం ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు క్యూకడుతుండటంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు బస్సుల్లో కూడా టిక్కెట్లు లేవు. బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఐదు వేలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.
టోల్ ప్లాజాల వద్ద....
ఇక బస్సుల్లో వెళ్లలేని వారు రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో భారీగా రద్దీ ఏర్పడింది. రిజర్వేషన్ లేకపోయినా రైలులో ప్రయాణానికి ఎక్కువ మంది సుముఖత చూపడంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సొంత వాహనాలలో అనేక మంది బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ట్రాఫిక్ జామ్ నెలకొంది.
Next Story