తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కుర
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు పడనుండగా.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జులై 4వ తేదీ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక 5వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. జులై 6,7వ తేదీల్లో కూడా వర్షాలు పడనున్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించగా.. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి.