Fri Mar 21 2025 00:42:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు రెండ్రోజులు వర్షసూచన
రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

హైదరాబాద్ : మండుటెండలతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటికబురు అందించింది. రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతోనే వర్షాలు కురవచ్చని తెలిపింది. కాగా.. ఈరోజు కూడా భాగ్యనగరంలో ఎండలు హడలెత్తించాయి. ఎల్బీనగర్ లో అత్యధికంగా 40.2డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Next Story