Fri Dec 20 2024 06:04:59 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేవంత్ రెడ్డిని కలిసిన కేకే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కలిశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. ఆయన రేపు కాంగ్రెస్ లో చేరతారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేకే ఆయన కుమార్తె రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
మర్యాదపూర్వక భేటీ...
అయితే కాంగ్రెస్ అధినాయకత్వం సూచన మేరకు కె.కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేశవరావు మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించుకున్నారని తెలిసింది. కేకే కుమారుడు విప్లవ్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని నిన్న ప్రకటించారు.
Next Story