Mon Dec 23 2024 23:36:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి
నేడు రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు
నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
నిబంధనల ప్రకారం...
గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒకే ఒక వార్డు దక్కింది. అయినా మేయర్ మాత్రం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం వారు పార్టీలు మారినా పదవులు కోల్పోయే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Next Story