Tue Apr 01 2025 18:34:38 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీతో పొత్తు అవాస్తవం
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ స్పందించారు

భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ స్పందించారు. టీడీపీతో పొత్తు కేవలం కల్పితమే అని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు. ఎవరితోనూ పొత్తు ఉండదని ఆయన తెలిపారు.
ఏపీలో మాత్రం....
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు ఉందని, దానితోనే కలసి పోటీ చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆయన తెలిపారు. ఈ పొత్తులు కేవలం మీడియాలో వస్తున్న వార్తలేనని, వాస్తవాలు కావని ఆయన అన్నారు.
Next Story