Fri Dec 27 2024 18:53:51 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ రైల్వేస్టేషన్ పై దాడికి యత్నం... ఉద్రిక్తత
వరంగల్ లో రాకేష్ అంతిమయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్ఎస్ శ్రేణులు ఈ అంతిమ యాత్రలో పెద్దయెత్తున పాల్గొన్నాయి
వరంగల్ లో రాకేష్ అంతిమయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దయెత్తున పార్టీ శ్రేణులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నాయి. వరంగలోని ఎంజీఎం ఆసుపత్రి నుంచి ర్యాలీ బయలుదేరింది. అయితే మధ్యలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు అంటించబోయారు. దీనిని పోలీసులు వెంటనే అడ్డుకుని మంటలను ఆర్పివేశారు. పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ లోకి....
రాకేష్ అంతిమ యాత్ర వరంగల్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చేసరికి స్టేషన్ లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. స్టేషన్ లోకి రాకేష్ మృతదేహాన్ని తీసుకెళ్లాలని కొందరు పట్టుబట్టారు. అయితే పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అంతిమ యాత్ర రైల్వే స్టేషన్ వైపు వెళ్లకుండా దారి మళ్లించారు. వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story