Mon Dec 23 2024 04:40:38 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్.. ఒకే ఏడాది నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
వరంగల్ జిల్లా నెక్కొండకు మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు చ్చాయి
ఈరోజుల్లో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం దొరకడమంటే గగనం. అలాంటిది ఒక యువకుడు ఏకంగా నాలుగు ఉద్యోగాలు కొట్టాడంటే ఆ యువకుడిని ఏమనుకోవాలి? అతడి పట్టుదలను ఏమని ప్రశంసించాలి. శ్రమను ఏమని అభినందించాలి. వరంగల్ జిల్లా నెక్కొండకు మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ కు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు చ్చాయి. తొలుత రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగం వచ్చింది. ఏడు నెలల ఆ ఉద్యోగం చేయగానే ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినట్లు లెటర్ వచ్చింది.
వరసబెట్టి రావడంతో...
ఇక ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం అనుభవిస్తుండగానే మరో తీపికబురు. గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయినట్లు లెటర్ వచ్చింది. అందులో చేరాలని భావిస్తుండగా టౌన్ ప్లానింగ్ అధికారిగా రంజిత్ ఎంపికయ్యాడు. దీంతో తాను టౌన్ ప్లానింగ్ అధికారిగా నిర్ణయించుకున్నారు. అసలే ఉద్యోగాలు దొరకని ఈరోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఆ కుటంబంలో ఎనలేని సంతోషాన్ని నింపింది. వేణుగోపాల్, అరుణ దంపతుల పెద్దకుమారుడు రంజిత్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
Next Story