Mon Dec 23 2024 14:46:49 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఒక్క రోజులోనే 14,750 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగింది
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఒక్క రోజులోనే 14,750 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో పదహారు వేల మెగావాట్లు విద్యుత్తు వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం ప్రారంభించడంతో విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా పెరిగిందన్నది అధికారులు భావన.
ఎండలు పెరగడంతో...
ఎండలు పెరగడం, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విద్యుత్తు వినియోగం ఎక్కువయిందని అధికారులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో రానున్న కాలంలో విద్యుత్తు వినియోగం మరింత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా విద్యుత్తు సరఫరా ఉండేలా చూడాలని ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story