Fri Nov 22 2024 21:44:00 GMT+0000 (Coordinated Universal Time)
ఘాటెక్కిన మిర్చి.. క్వింటా రూ.44 వేలు
మిర్చి ఘాటెక్కింది. మార్కెట్లో మిర్చి ఎన్నడూ లేనంత సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా మిర్చి ధర ఏకంగా రూ.44 వేల మార్కును దాటింది.
వరంగల్ : మిర్చి ఘాటెక్కింది. మార్కెట్లో మిర్చి ఎన్నడూ లేనంత సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా మిర్చి ధర ఏకంగా రూ.44 వేల మార్కును దాటింది. దాంతో మిర్చి సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్లో దేశీయరకం మిర్చి క్వింటా ధర రూ.44 వేలు పలికింది. సింగిల్ పట్టీ రకం మిర్చి కూడా రికార్డు ధర పలికింది. క్వింట్ రూ.42,500 రావడంతో మిర్చి రైతుల ఆనందానికి అవధుల్లేవు.
ఏటా మిర్చి పంటకు తెగులు సోకడం, లేదా అకాల వర్షాలతో పంట పాడవ్వడం.. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతో.. డిమాండ్ కు తగ్గ దిగుబడి లేకపోయేది. దాంతో ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి గిరాకీ ఏర్పడింది. అందుకే మిర్చి ధరలు రికార్డు సృష్టించాయని ఎనుమాముల మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
Next Story