Sat Apr 05 2025 20:26:41 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : టన్నెల్ లో రెస్యూ ఆపరేషన్ కు ముగింపు ఎన్నడో?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. నేడు సహాయక చర్యలు నలభై ఒక్కరోజుకు చేరకున్నాయి. మృతదేహాలను గుర్తించి వాటిని బయటకు తేవడం కష్టంగానే మారింది. నిరంతరం సహాయక బృందాలు శ్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. మృతదేహలున్నట్లు గుర్తించినప్పటికీ వాటిని వెలికి తీయడం మాత్రం కష్టంగా మారింది. ముందుగా అక్కడ పేరుకుపోయిన బురద, టీబీఎం మిషన్ శిధిలాల తొలగింపు జరిపితేనే మృతదేహాల వెలికి తీయడం సాధ్యమవుతుంది.
తవ్వకాలు జరపాలనుకున్నా...
మృతదేహాలను గుర్తించిన చోట తవ్వకాలు జరపాలనుకుంటున్నా అక్కడ అది సాధ్యపడటం లేదు. టన్నెల్ లో డేంజర్ పరిస్థితులు ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు కూడకా సహాయక బృందాలు జంకుతున్నాయి. అధికారులు కూడా అక్కడ తవ్వకాలు జరపలేమని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషించడానికి నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. నిపుణులు వచ్చినప్పటికీ టన్నెల్ లో ఉన్న పరిస్థితులను బట్టి మృతదేహాలను వెలికి తీయడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రభుత్వం సూచనలతో...
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వం అందించే మార్గ దర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆరుగురు మృతదేహాలను వెలికి తీసేంత వరకూ సహాయక చర్యలు కొనసాగించాలని చెప్పడంతో మధ్యలో వాటిని ఆపే అవకాశం లేదు.అందుకే పన్నెండు బృందాల్లోని 650 మంది సభ్యులతో పాటు జిల్లా అధికారులు కూడా, వివిధ విభాగాలకు సంబంధించిన వారు నలభై ఒక్కరో్జు నుంచి అక్కడే మకాం వేసి ఉన్నారు. మరి దీనికి ఎండ్ కార్డు ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
Next Story