Mon Dec 23 2024 07:58:22 GMT+0000 (Coordinated Universal Time)
నామా వస్తే కుర్చీ ఉంటుంది.. సీటు లేదన్న రేణుక
నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే గాంధీభవన్ లో కుర్చీ ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు
నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే గాంధీభవన్ లో కుర్చీ ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గాంధీభవన్ లో చాలా కుర్చీలున్నాయన్న రేణుక సీటు విషయంలో మాత్రం కుదరదని చెప్పారు. ఖమ్మం సీటును ఈసారి గెలిచే వారికే ఇవ్వాలని ఆమె కోరారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయిన తర్వాత ఆమె మాట్లాడుతూ ఖమ్మంలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఖమ్మంలో చోటులేదని ఆమె తెలిపారు.
న్యాయయాత్ర పేరుతో...
రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు.సీఎం రేవంత్ మహిళా పక్షపాతి అని, ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇచ్చారన్నారు. పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏం ఆధారాలతో మాట్లాడుతున్నాడు అతని పై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఖమ్మం ప్రజలు అందరూ తన వారసులేనని, ఖమ్మం సీటు గెలవడం ఖాయమని అన్నారు.
Next Story